Saturday, March 21, 2009

పిరమిడ్ పార్టీ మ్యానిఫెస్టో

" ఆత్మజ్ఞానులకే పాలనార్హత "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క ప్రార్ధన ధ్యేయం - " ఆత్మజ్ఞానులే పాలకులుగా ఉండాలి " అని ! "యథా రాజ తథా ప్రజా " అన్నారు కదా ! ప్రజలు ఎలా ఉండాలనుకుంటారో అలా రాజులు ఉండితీరాలి ! అప్పుడే వారి సరి అయిన మార్గదర్శకులు కాగలరు ! తనకు తానుగా అన్ని సంపదిన్చుకున్నవాడే, మరి ఇంక సంపాదించుకోవడానికి ఏమీ లేనివాడే - "రాజు" గా ఉండటానికి అర్హుడు. నటి రోజులలో రాజులు, చక్రవర్తులు ఉన్నారు. మరి నేటి రోజులలో, నేటి సామజిక వ్యవస్థలో ప్రజలచే ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లు 'ం.ళ్.ఆ', 'ం.P' లే రాజులు ! చక్రవర్తులు !ప్రజప్రతినిదిలుగా ఉండటానికి ఆత్మజ్ఞానులు సంసిద్దిలు కాకపొతే ఏక ప్రజలు సరియినవారిని ఎలా ఎన్నుకుంటారు ?ప్రజా ప్రాతినిధ్యానికి ఇష్టపడి వారందరూ ఆత్మజ్ఞాన శున్యులైనప్పుడు, మరి ఏదో కొద్ది హేచ్చుతగ్గులతో సరిసమానంగా స్వార్ధపోరితులైనప్పుడు - ఇక ప్రజలకు దారి ఏముంది ...? అయితే, ఇకముందు ప్రజలకు ఈ నిస్సహాయత ఉండబోదు ! ఎందుకంటే " పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా " ఆత్మజ్ఞానపరాయనులను ప్రజప్రాతినిధ్యం వహించడానికి సిద్ధం చేస్తోంది ! రానున్న రాష్ట్ర ఎన్నికలలో ఆంధ్రరాష్ట్రంలోని అన్ని నియోజిక వర్గలకూ " పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా " తన ప్రతినిధులను సంసిద్ధం చేస్తోంది. " పిరమిడ్ పార్టీ " ద్వారా ప్రజల జీవితాలలో ధ్యానం ఒక అంతర్భాగం అయిపోతుంది. " పిరమిడ్ పార్టీ " ద్వారా ఆత్మజ్ఞానం ప్రజలందరి సొంతం అవుతుంది. " పిరమిడ్ పార్టీ " ద్వారా స్పిరిచ్యువల్ సైన్స్ అన్నది విద్యాలయాలలో ఒక ముఖ్య పాఠ్యఆంశం అయిపోతుంది!

No comments:

Post a Comment