Saturday, March 21, 2009

అభివృద్ధి కార్యక్రమాలు

ప్రజలలో ఆటలకు ,పాటలకు పార్టీ అత్యంత ప్రదన్యతనిస్తుం. "పిరమిడ్ పార్టీ" యొక్క నినాదం : " రోటి, కపడా, మకాన్... ఔర్ ఆత్మజ్ఞాన్ ! నృత్, సంగీత, ఖేల్ ... ఔర్ బ్రహ్మజ్ఞాన్ ! "పల్లెసీమల్లో, మరి పట్టనలల్లో " పరిశుభ్రత " అన్నది అతి ముఖ్యమైన ఆంశం. అలాగే పట్టనలల్లో " ధ్వని కాలుష్యం " లేకుండా ఉండడం కూడా చాల అవసరం ; ఇలాంటి విషయాలన్నింటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది "పిరమిడ్ పార్టీ".పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నేటి కంప్యూటర్ యుగానికి మరింత ఘనస్వాగతం పలుకుతుంది. ఇంఫోర్మషన్, కమునికేషన్, ట్రాన్స్పోర్టు రంగాలు ఎంత పటిష్టంగా ఉంటే అంతా సౌభాగ్యం; వీటిని అన్నిటిని శాస్త్రీయ పద్ధతిలో విసృతం చేస్తుంది పిరమిడ్ పార్టీ. ప్రతి పల్లెకూ విద్యుత్, త్రాగునీరు, మరి సాగునీరు లభించేందుకు "పిరమిడ్ పార్టీ" విసృతం కృషి చేస్తుంది."పిరమిడ్ పార్టీ" స్త్రీలు అన్ని రంగాలలోనూ సరిసమాన ప్రతిపత్తి, సరిసమాన ప్రాతినిధ్యం కల్పిస్తుంది. ఇకనుంచి చదువుల్లోనూ, ఊద్యొగాల్లోనూ కేవలం "మెరిట్" కే విలువ ఉంటుంది.ఆర్ధికంగా వెనుకబడి ఉన్నవాళ్ళకు తప్పనిసరిగా తగిన ఆర్ధిక సహాయం ఇవ్వబడుతుంది.రాష్ట్రంలో, దేశంలో ... రోడ్ల మరి పబ్లిక్ స్తలాల్లో ఇక బిక్షగాళ్ళు నిషేదింపబడతారు ; వారికి ప్రత్యెక వసతులు ఏర్పరచబడతాయి. భూమిపై పుట్టినందుకు భూమి పరిరక్షణ అన్నది ప్రతిఒక్కరి భాద్యత. "తిరిగి ప్రక్రుతి పథంలోకి... అన్నదే పిరమిడ్ పార్టీ యొక్క ప్రార్ధన నినాదం; మానవుడు ప్రకృతిలో ఎంత తాదాత్మ్యం చెందితే అంత బుద్ధిమంతుడు అవుతాడు."పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా" సరికొత్త అడవుల పెంపకం ద్వారా భూమండలాన్ని నందనవనంగా చేసి తీరుతుంది.జంతు సామ్రాజ్యం యొక్క మనుగడ వృక్ష సామ్రాజ్యం యొక్క వ్రుక్షోత్పతిపై ఆధారపడి ఉంటుంది. మరి రెండింటి సామ్రాజ్యాల సముద్ధరనే మానవధర్మం. ధర్మాన్ని తన ముఖ్య ధర్మంగా భావిస్తోంది ... "పిరమిడ్ పార్టీ".

No comments:

Post a Comment