" పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా" అన్న ఈ నూతన రాజకీయ పార్టీ పిరమిడ్ ధ్యాన కేంద్రాల మాస్టర్లచే స్థాపించబడింది !పిరమిడ్ ధ్యాన కేంద్రాలు పదేళ్ళుగా ఆంధ్రరాష్ట్రమంతటా శాఖోపశాఖలుగా విస్తరిల్లి అనేకానేక యొగులనూ, ధ్యనులనూ, మాస్టర్లను తయారుచేస్తున్నాయి !వాస్తవానికి పై లోకాల లోని గ్రేట్ మాస్టర్ల ద్వారానే " పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా" సంకల్పించబడింది ! ఫెబ్రవరి 25, 1999 సంవత్సరంలో ఈ " పిరమిడ్ పార్టీ" అన్నది తిరుపతి లో లాంచనప్రాయంగా ప్రకటించబడింది !మే 2, 1999 సంవత్సరం ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా వద్ద " పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా" గా రిజిస్టర్ చేయబడింది !
వ్యక్తిగత జీవితవిధానంలో పెనుమార్పు అవసరం, అవసరం !కుటుంబ పరిస్తితులలో పెనుమార్పు అవసరం, అవసరం !సామాజిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు అవసరం, అవసరం !పరిపాలనా యాంత్రంగంలో విప్లవాత్మకమైన మార్పు అవసరం, అవసరం !దేశ ఆదర్శాలలో విప్లవాత్మకమైన మార్పు అవసరం, అవసరం !"వసుదైక కుటుంబం" అన్నది అతి త్వరగా అవసరం, అవసరం !" మార్పు ఎలా సంభవం ? "అన్ని స్థాయిల్లో ధ్యానం, ఆత్మజ్ఞానం, మరి ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం అన్నవాటిని ప్రవేశపెట్టడం ద్వారానే !!
సౌకర్యంగా ఉండే ఏదేని భంగిమలో కూర్చుని, కళ్లు రెండూ మూసుకుని, చేతులు రెండూ కలిపి, మామూలుగా జరుగుతున్న ఉచ్చ్వాస నిశ్వసలనే గమనించాలి. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తుంటే వాటిని "కట్" చేసి మళ్ళి మళ్ళి శ్వాస మీదకు ధ్యాసను మరల్చాలి. ఉచ్చ్వాస నిశ్వసలనే గమనిస్తూ వుంటే శ్వాస క్రమక్రమంగా చిన్నదవుతూ "భ్రుమధ్యం" లోకి తనంతట తానుగా చేరుకున్తుంది. క్రమక్రమంగా ఆలోచనారహిత స్థితి స్థితమవుతుంది. ఆ ఆలోచనారహితస్తితిలో కలిగే ఎన్నో శారీరక, నాడిమండల, ఆత్మనుభావాలను గమనిస్తూ వుండాలి. ప్రారంభంలో ధ్యానం చేసేటప్పుడు గదిని చీకటి చేసుకోవడం ఉత్తమం. ధ్యానం వల్ల లాభాలుశారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మా విశ్వాసంపరస్పర అవగాహనా, బుద్ది సూక్ష్మత, దివ్య చక్షువు ఉత్తేజితం, ఆత్మజ్ఞానం, దివ్య దృష్టిపిరమిడ్ అద్భుత శక్తిపిరమిడ్ నముఉనాలతో ప్రయోగాలు చేసి ఎందరో మహానుభావులు ఎన్నో అద్భుత విషయాలను తెలుసుకోగలిగారు. పిరమిడ్ లో ధ్యానం చెస్తూ ఏంటో మంది తమ రోగాలు నయం చేసుకున్నారు. తలనొప్పి నుండి కాన్సర్ వరకూ ఎటువంటి అనరోగ్యలైన అతి తక్కువ కాలంలో నయమైనాయి. "పిరమిడ్ శక్తి " వల్ల శరీరంలోని కణాలూ, కణజాలాలు, అవయవాలు, గొప్ప స్తాయిలో పనిచేసే సామర్ధ్యాన్ని పొందుతాయి. ఇందువల్ల దీర్ఘాయువు కూడా సాధ్యం.
No comments:
Post a Comment